• waytochurch.com logo
Song # 26916

maa hrudayamulalo devuni premanu kummarinchithivi మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి


మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి
మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా
ఆనందించెదము ఎల్లప్పుడు ఆనందించెదము
ఆనందించెదము మేము ఆనందించెదము
నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదము
మాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదము
యేసు యేసు నీ ద్వారనే
మేము దేవునితో సమాధానము కలిగియుంటిమి
యేసు యేసు నీ వలనే కదా
మేము నీతోడి దేవునికి వారసులమైతిమి ||మా హృదయములలో||

ఘోర పాపులము నీ తట్టు తిరిగితిమి
కృపను చూపితివి పరిశుద్ధపరిచితివి
మా అపరాధముల కొరకు అప్పగింపబడి
మము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినావు
మాకు నిత్య స్వాస్థ్యము నిశ్చయతను అనుగ్రహించుటకు
పరిశుద్ధాత్మను సంచకరువుగా మాలో నింపితివి ||మా హృదయములలో||

శ్రమల కాలములో శోకముల ఘడియలలో
నీ ప్రేమ మది తలచి ఆదరణ పొందెదము
మేమికను పాపులముగా నుండగానే ప్రభూ
మా కొరకు సిలువలో ప్రాణమును పెట్టితివి
మేమిపుడు ఇంకేమి నిన్ను కోరెదము
ఏ స్థితిలోనైనా నీలో ఆనందించెదము ||మా హృదయములలో||

maa hrudayamulalo devuni premanu kummarinchithivi
maa hrudayamulalo vasinchuchunna parishuddhuni dwaaraa
aanandinchedamu ellappudu aanandinchedamu
aanadinchedamu memu aanandinchedamu
neevichchina rakshananu battu aanandinchedamu
maakichchina nithya jeevamunu batti aanandinchedamu
yesu yesu nee dwaarane
memu devunitho samaadhaanamu kaligiyuntimi
yesu yesu nee valane kadaa
memu nee thodi devuniki vaarasulamaithimi ||maa hrudayamulalo||

ghora paapulamu nee thattu thirigithimi
krupanu choopithivi parishuddhaparichithivi
maa aparaadhamula koraku appagimpabadi
mamu neethimanthulugaa theerchutaku lepabadinaavu
maaku nithya swaasthyamu nischayathanu anugrahinchutaku
parishuddhaathmanu sanchakaruvugaa maalo nimpithivi ||maa hrudayamulalo||

shramala kaalamulo shokamula ghadiyalalo
nee prema madi thalachi aadarana pondedamu
memikanu paapulamugaa nundagaane prabhu
maa koraku siluvalo praanamunu pettithivi
memipudu inkemi ninnu koredamu
ae sthithilonainaa neelo aanandinchedamu ||maa hrudayamulalo||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com