bahu soundharya seeyonulo sthuthi simhaasanaaseenudaa బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా
బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే
పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు
నాలోనిరీక్షణ - నీలో సంరక్షణ నీకే నాహృదయార్పణ
ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు
నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక
ఒంటరిబ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే