neeve naa snehamu neeve naa sarvasvamu నీవే నా స్నేహము నీవే నా సర్వస్వము
నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము
నీవే ఆధారము – నీవే నా ఆనందము
నీ ప్రేమ నాలో పదిలము
నీలోనే సాక్ష్యమే సంతోషము (2)
సర్వోన్నతుడా నీకే మహిమ
పరమ తండ్రి నీకే ఘనత (2) ||నీవే||
నా జీవితాంతం నిన్నే పొగడెదను
నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే (2)
నా దేవుని మందిరములో నివసించెదను
నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – (2) ||సర్వోన్నతుడా||
నా బలహీన స్థితిలో గతివి నీవైతివే
నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే (2)
కృంగిన నా హృదయమును లేవనెత్తితివి
అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా – (2) ||సర్వోన్నతుడా||