neelaanti prema ee lokaana నీలాంటి ప్రేమ ఈ లోకాన
నీలాంటి ప్రేమ ఈ లోకాన
ఎవరైనా చూపారా? – (2)
నా పాపభారం ఆ సిలువపైన
ఎవరైనా మోశారా? – (2)
యేసయ్యా.. యేసయ్యా..
యేసయ్యా.. ఓ యేసయ్యా (2) ||నీలాంటి||
చెలికాడే నిన్ను సిలువకు పంపగా
పరిసయ్యులే నిన్ను పరిహసించగా (2)
నోరు తెరువని ప్రేమ
బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా||
దొంగలే నిన్ను దూషించగను
నా అనువారే అపహసించగా (2)
నోరు తెరువని ప్రేమ
బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా||
తండ్రి వీరు చేయునదేమో
ఎరుగరు కనుక క్షమియించుమని (2)
ప్రార్ధన చేసితివయ్యా
మము క్షమియించితివయ్యా (2) ||యేసయ్యా||
నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా
ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా (2)
నీదు ప్రేమే నా గానం
నీ ప్రేమే నా భాగ్యం (2) ||యేసయ్యా||