jeevapradhaathavu nanu roopinchina silpivi neeve prabhu జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవే ప్రభు
జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవే ప్రభు
జీవనయాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు
జగములనేలే మహిమాన్వితుడా – నాయెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడెదనూ – ఏమని పొగడెదను
శుభకరమైన తొలిప్రేమనునే – మరువక జీవింప కృప నీయ్యవా
కోవెలలోని కానుక నేనై – కోరికలోని వేడుక నీవై
జత కలిసి నిలిచి – జీవింప దలచి కార్చితివి నీ రుధిరమే
నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా
నేనేమైయున్న నీ కృప కాదా – నాతో నీ సన్నిధిని పంపవా
ప్రతికూలతలు శృతిమించినను – సంధ్యాకాంతులు నిదురించినను
తొలి వెలుగు నీవై – ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా
నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా
మహిమను ధరించిన యోధులతో కలసి – దిగి వచ్చెదవు నా కోసమే
వేల్పులలోన బహుఘనుడవు నీవు – విజయ విహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో – ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఏనాడూ పొందని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా