gaganamu cheelchukoni ghanulanu theesukoni గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానై యున్న
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా
నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది
1.నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది
పవిత్రురాలైన కన్యకగా
నీ యెదుట నేను నిలిచెదను
నీ కౌగిలిలో నేను విశ్రమింతును...
2.నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది
మర్మమైయున్న నీవలే రూపించుచున్నది
కళంకము లేని వధువునై
నిరీక్షణతో నిను చేరెదను
యుగయుగాలు నీతో ఏలేదను...
3.నీ కృపా బాహుళ్యామే ఐశ్వర్యం ఇచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది
అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో
సీయోనులో నీతో నేనుందును...