siluvapaina prema chupa maranamaayenu సిలువపైన ప్రేమ చూప మరణమాయెను
సిలువపైన ప్రేమ చూప మరణమాయెను
1. దురిత జనుల దోషం బాప భువికెంచె ఈ ప్రేమ
నిసిని వీడి కాంతి నివ్వ వెలుగునింపే ఈ ప్రేమ
క్షమణోసంగ కఠిన నరుల శ్రమ సహించే ఈ ప్రేమ
విశ్వమంత ముక్తి నొంద దానమాయె ఈ ప్రేమ
పరిశుద్ధతను నీకు నివ్వ పాపమయ్యెను
పరమపురము నీవు చేర మార్గమాయెను
2. లోక పాప బారం మోయ బలిగా మారే ఈ ప్రేమ
దోష శిక్ష తబరించి రక్త మోడ్చే ఈ ప్రేమ
శాంతి రక్ష మనకు నీయ శిక్షా నొందే ఈ ప్రేమ
మహిమ రూపం నీవు దాల్చ సొగసు విడిచే ఈ ప్రేమ
మరణమున్ మరణింపజేయ మరణమాయెను
తిరిగిలేచి మరణం గెల్చి విజయుడాయెను