endhukani nenante intha prema ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ
ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన – ఇంత కరుణ
జడివాన లోయలో – ఎదురీత బాటలో
ఎన్నడూ వీడనీ – దైవమా యేసయ్య
ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన – ఇంత కరుణ
1. ఆశ చూపే లోకం – గాయాలు రేపెనే
గాలి వానై నాలో – నను కృంగదీసెనే
మాతృమూర్తి నీవై – లాలించె నన్నిలా
ఆదరించసాగే – నీ ప్రేమ వెన్నెల
క్షణమైనా – యుగమైనా – నీ మమతే కనుపాపలా
2. మోయలేని భారం – నీపైన మోపగా
ఆరిపోదు దీపం – నీ చెంతనుండగా
ఎండమావియైనా – నీ ప్రేమ చాలుగా
ఎంత దూరమైనా – నా తోడు నీవెగా
కలనైనా – ఇలనైనా – నీ కృపలో కాపాడవా