sadha neevu na thoduga yesaiyah సదా నీవు నా తోడుగా యేసయ్య
సదా నీవు నా తోడుగా యేసయ్య
పదే ప్రేమ చూపావుగా
ప్రతీ చోట నీ సాక్షిగా యేసయ్య
సదా నేను జీవించనా
తరాలెన్నో దాటించు నీ బలం
యుగాలైన నీ ప్రేమయే శాశ్వతం
వరాలెన్నో వర్షించు నీ గుణం
నివాళై సమర్పింతు నా జీవితం
విధాతై ఇలా కోరుకున్నావుగా నన్నే ఆదరించావుగా
సదా నీవు నా తోడుగా యేసయ్య
పదే ప్రేమ చూపావుగా
1. తేనె వంటి – స్వరము నీది – పిలిచె నన్ను – నా యేసయ్య
అంతులేని – మమత చూపి – తీర్చినావు – నా దాహమే
ప్రాణ నాధా – జీవదాత – మధురమైన నీ ప్రేమనే
ఆత్మతోను మనసుతోను ఆలపించి నే పాడనా
విమలమైన – నీ స్నేహమే – మారిపోని – సంబంధమే
ప్రబలమైన – నీ నామమే – ప్రాణమైన – నీ ధ్యానమే
కరముచాపి – జాలిచూపి – కాచినావు – నా దైవమా
సదా నీవు నా తోడుగా యేసయ్య
పదే ప్రేమ చూపావుగా
ప్రతీ చోట నీ సాక్షిగా యేసయ్య
సదా నేను జీవించనా
2. ఆరిపోని – తరిగిపోని – మరచిపోని – నీ ప్రేమతో
లోకమందు – వీడిపోని – నీడ నీవే – నా యేసయ్య
ఎండమావి – తీరమందు – ఊరడించే – నీ వాక్యమే
చేరదీసి – కరుణచూపి – తల్లడిల్లె – నాకోసమే
పలకరించె – నీ మాటలే – దీపమాయె – నా బాటలో
పరితపించె – వాత్సల్యమే – నాలో పొంగే – ఆనందమే
అనిశమైన – నీదు ప్రేమ – చాలు నాకు – నా దైవమా