naa pourasthithi paramandhunnadhi నా పౌర స్థితి పరమందున్నది
నా పౌర స్థితి పరమందున్నది
ఇల నా ఉనికి అస్థిరమైనది
యాత్రికుడననీ నేనెరుగుదును
ఒక నాడు నా యింటికి చేరెదను
నాశనకరమైన గుంటను పోలిన
లోకమునుండి లాగబడియున్నాను
తిరిగి జన్మించిన పరదేశీయుడను
పరలోక పిలుపును ఎరిగియున్నాను
నరులారా తిరిగి రండని పిలిచిన
నేనూ అచటికి వెళ్లిపోవలయును
నిత్యత్వమందున దేవునితో ఉందును
పరలోక మహిమను అనుభవించెదను