• waytochurch.com logo
Song # 2699

ghanamaina kreesthu krupao ganఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి న


Chords: ragam: బిలహరి-bilahari

ఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి నిపుడు ఘనుఁడు తన మహిమచేఁ
గాఁచి పెంచెను నన్ను ||ఘనమైన||

1. ఆపదలలో మునిఁగి యడలుచుండఁగ నన్ను ఁ జేపట్టెను చింత చే
జెడకు మనుచు వేపాకు కన్న నిది వెగటైన నా జిహ్వ తీపుగా నొనరించి
స్ధిరపరచె నిపుడు ||ఘనమైన||


2. ఘనమైన యాపదల కడలిలో ఁ బడి యున్న ఘనుఁడు నా దెసఁ జూచి
మనసు నొచ్చుకొనియె కనికరముచే నిన్నుఁ గరుణింతు నిప్పుడె వెనుకఁ
జూడక తనదు వెంట రమ్మనెను ||ఘనమైన||


3. కుల గోత్రములు వీడి కుటిలంబు దిగనాడి వలబడ్డ చేఁపవలె వదల
కని పలికెన్ సిలువపై నసు విచ్చి బలహీన మెడలించి వలవలను
కన్నీరు వల పోసినాఁడు ||ఘనమైన||


4. పర్వతములపైఁ గట్టు పట్టణమువలె నిన్ను నుర్విలో నుంచితి నుచి
తంబుగాను సర్వజనులకు వెలుఁగు సాక్షిగా నీవుండి గర్వింప వలదనుచు
||ఘనమైన||


5. సదమలం బగు జ్ఞాన సరణి యిదె నా మాట ముదముతో నమ్మినను
మోక్ష మోసఁగెదను కదిసి సాతాను బలు కాడిక్రిందను బడిన విదలించి
నరకమున వేతునని పలికెన్ ||ఘనమైన||

ghanamaina kreesthu krupAO ganugoMti nipudu ghanuAOdu thana mahimachaeAO
gaaAOchi peMchenu nannu ||ghanamaina||

1. aapadhalaloa muniAOgi yadaluchuMdAOga nannu AO jaepattenu chiMtha chae
jedaku manuchu vaepaaku kanna nidhi vegataina naa jihva theepugaa nonariMchi
sDhiraparache nipudu ||ghanamaina||


2. ghanamaina yaapadhala kadaliloa AO badi yunna ghanuAOdu naa dhesAO joochi
manasu nochchukoniye kanikaramuchae ninnuAO garuNiMthu nippude venukAO
joodaka thanadhu veMta rammanenu ||ghanamaina||


3. kula goathramulu veedi kutilMbu dhiganaadi valabadda chaeAOpavale vadhala
kani paliken siluvapai nasu vichchi balaheena medaliMchi valavalanu
kanneeru vala poasinaaAOdu ||ghanamaina||


4. parvathamulapaiAO gattu pattaNamuvale ninnu nurviloa nuMchithi nuchi
thMbugaanu sarvajanulaku veluAOgu saakShigaa neevuMdi garviMpa valadhanuchu
||ghanamaina||


5. sadhamalM bagu jnYaana saraNi yidhe naa maata mudhamuthoa namminanu
moakSh moasAOgedhanu kadhisi saathaanu balu kaadikriMdhanu badina vidhaliMchi
narakamuna vaethunani paliken ||ghanamaina||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com