unnathamyna sthalamulalo ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా cm
పల్లవి: ఉన్నతమైన స్థలములలో - ఉన్నతుడా మా దేవా ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా || ఉన్నత || 1. చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నిలుపుము దేవా || ఉన్నత || 2. పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను ఆయాసకరమైన మార్గము మాలో - వున్నదేమో పరికించు చూడు జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా || ఉన్నత || 3. మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగా ప్రోక్షించెదము సజీవయాగ శరీరములతో - రూపాంతర నూతన మనసులతో నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము - నీ కృపచేత బలపడియెదము లోకమున నీ వార్తను మేము - భారము తోడ ప్రకటించెదము || ఉన్నత ||