ninnu naenu viduvanu dhaeva neనిన్ను నేను విడువను దేవ నీవు న
నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నమ్మినవారల
నెల్ల నీవు చక్కఁగ దీవించెదవు ||నిన్ను||
1. నేను శత్రువునై యుండంగ నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి
నా కొరకు దారుఁడౌ నీ ప్రియ పుత్రుని ||నిన్ను||
2. త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను ఁ గాంచి ప్రోవ(గోరి
మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను ||నిన్ను||
3. నాఁటనుండి నేఁటి వరకు నాకుఁ గల్గిన శోధనములలో నేటుగా
ననుఁ గాచిన వాఁడవు నీవు గావా, ఓ నా తండ్రి ||నిన్ను||
4. ఇంత కాలము నన్నుఁ గాచి యిఁకను నన్ను విడువ వనుచు సంత
సించి మదిని నేను జక్కఁగ నీ దరి జేరితిని ||నిన్ను||
5. నీవు గాక యెవరున్నారు నేలపైని ననుఁ గాపాడఁ చేవ లేని నాకు నీవు
చేవ గలుగఁ జేయఁ గలవు ||నిన్ను||
6. అడుగు వారి కిచ్చెద నంచు నాన తిచ్చినావు గాన నడిగెద నిను
సాహాయ్యంబు నాత్మమై యున్నట్టి తండ్రి ||నిన్ను||
7. నాదు ప్రార్థన లన్నియి నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి
నన్ను నేర్పు దనరఁగ రక్షించితివి ||నిన్ను||
ninnu naenu viduvanu dhaeva neevu nanu dheeviMchu varaku ninnu namminavaarala
nella neevu chakkAOga dheeviMchedhavu ||ninnu||
1. naenu shathruvunai yuMdMga neevu naapai nenaru joopi dhaana michchithivi
naa koraku dhaaruAOdau nee priya puthruni ||ninnu||
2. throava dhappi thiruguchuMda dhudukunaina nannu AO gaaMchi proava(goari
madhini neevu throavanu bettithivi nannu ||ninnu||
3. naaAOtanuMdi naeAOti varaku naakuAO galgina shoaDhanamulaloa naetugaa
nanuAO gaachina vaaAOdavu neevu gaavaa, oa naa thMdri ||ninnu||
4. iMtha kaalamu nannuAO gaachi yiAOkanu nannu viduva vanuchu sMtha
siMchi madhini naenu jakkAOga nee dhari jaerithini ||ninnu||
5. neevu gaaka yevarunnaaru naelapaini nanuAO gaapaadAO chaeva laeni naaku neevu
chaeva galugAO jaeyAO galavu ||ninnu||
6. adugu vaari kichchedha nMchu naana thichchinaavu gaana nadigedha ninu
saahaayyMbu naathmamai yunnatti thMdri ||ninnu||
7. naadhu praarThana lanniyi neevu needhu krupachae naalakiMchi needhu saraNini nilpi
nannu naerpu dhanarAOga rakShiMchithivi ||ninnu||