aasheeravmbu lmaameeaodha varshimpajaeyuఆశీరవంబు ల్మామీఁద వర్షింపజేయు
1. ఆశీరవంబు ల్మామీఁద
వర్షింపజేయు మీశ
యాశతో నమ్మి యున్నాము
నీసత్య వాగ్దత్తము.
|| ఇమ్మహి మీద
క్రుమ్మరించుము దేవ
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా ||
2. ఓ దేవ పంపింప వయ్యా
నీ దీవెన ధారలన్
మా దాహ మెల్లను బాపు
మాధుర్యమౌ వర్షమున్
3. మామీఁద కురియించు మీశ
ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీఁద
క్షామంబు పోనట్లుగన్.
4. ఈనాఁడె వర్షింపు మీశ
నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేఁడి
సన్నుతిఁ బ్రార్థింతుము.
1. aasheeravMbu lmaameeAOdha
varShiMpajaeyu meesha
yaashathoa nammi yunnaamu
neesathya vaagdhaththamu.
|| immahi meedha
krummariMchumu dhaeva
krammara praema varShMbun
grummariMchumu dhaevaa ||
2. oa dhaeva pMpiMpa vayyaa
nee dheevena Dhaaralan
maa dhaaha mellanu baapu
maaDhuryamau varShmun
3. maameeAOdha kuriyiMchu meesha
praema pravaahMbulan
samastha dhaeshMbu meeAOdha
kShaamMbu poanatlugan.
4. eenaaAOde varShiMpu meesha
nee niMdu dheevenalan
nee naamamMdhuna vaeAOdi
sannuthiAO braarThiMthumu.