aalimchu dhaevaa naa manavula ఆలించు దేవా నా మనవుల నాలించు ద
ఆలించు దేవా నా మనవుల నాలించు దేవా యాలించు నా దేవ
యన్ని సమయంబులఁ జాల గనపరచుచుఁ జక్కని నీ దయ ||ఆలించు||
1. సకల సత్యభాగ్య సంపద నీ యందు వికలంబు గాకుండ వెలయు
నెల్లప్పుడు ||నాలించు||
2. పలుమారు నీ వొసఁగఁ బరమ భాగ్యంబులు పొలిసి పోదు నీదు కలిమి
కాసంతైన ||నాలించు||
3. నా యఘము లన్నియు నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే నీ
సుతుని కృతమున ||నాలించు||
4. నీ యాజ్ఞ లన్నియు నేను జక్కఁగ సల్ప నీ యందు నమ్మిక నెగ
డించు మనిశంబు ||నాలించు||
5. నీ సేవ నొనరింప నిండుగ నిలలోన నీ సేవకుని కిమ్ము నీ శుద్ధాత్మను
కృపచే ||నాలించు||
aaliMchu dhaevaa naa manavula naaliMchu dhaevaa yaaliMchu naa dhaeva
yanni samayMbulAO jaala ganaparachuchuAO jakkani nee dhaya ||aaliMchu||
1. sakala sathyabhaagya sMpadha nee yMdhu vikalMbu gaakuMda velayu
nellappudu ||naaliMchu||
2. palumaaru nee vosAOgAO barama bhaagyMbulu polisi poadhu needhu kalimi
kaasMthaina ||naaliMchu||
3. naa yaghamu lanniyu naa thMdri kShmiyiMchu nee yanugrahamuchae nee
suthuni kruthamuna ||naaliMchu||
4. nee yaajnY lanniyu naenu jakkAOga salpa nee yMdhu nammika nega
diMchu manishMbu ||naaliMchu||
5. nee saeva nonariMpa niMduga nilaloana nee saevakuni kimmu nee shudhDhaathmanu
krupachae ||naaliMchu||