jadiyakumu nae nae yunnaanani జడియకుము నే నే యున్నానని కడు న
జడియకుము నే నే యున్నానని కడు నెనరు వాక్కిచ్చిన యేసుని
యడుగుజాడలు వెంబడించి నడుచుకొనరాదా జీవా యిడుమ లధికము
గలిగిన ప్రభుని కడకుఁ జేరరాదా ||జడియకుము||
1. ఇప్పుడు నిను బాధపరచెడి ముప్పులం దలపోసి తప్పక గొప్ప ప్రేమార్థంపు
శిక్షకు నొప్పియుండరాదా నీ తప్పులన్ విడి ప్రభువు నందు మెప్పు
బొందరాదా ||జడియకుము||
2. ఘనము ధనము సౌఖ్యంబు బోయి వ్యసనము శోధన మున్న యోబు
మనసు దృఢము చేసి ప్రభుని మహిమ పరపలేదా నీ మనసు
దృఢంబటుల జేసి మహిమ పరపరాదా ||జడియకుము||
3. బీద లాజరుండు భువిని బాధ నొందిన సాదృశ్యంపు బోధన నీ
మానసమున పాదుకొనలేదా యతఁ డాదరింపఁబడిన విధము
మోద మియ్యలేదా ||జడియకుము||
4. మున్ను సైఫనును రాళ్లతోఁ గొట్టు చున్న పగతుర కొరకు దేవుని మిన్ను
వైపునఁ జూచి యోర్చి మన్న నడుగలేదా నీ కున్న శ్రమలటు లోర్చఁ
బ్రభువు తెన్నుఁ జూపలేడా ||జడియకుము||
5. భక్త జనులను ఖైదుకు నీడ్చి బాధలు గావించినప్పుడు శక్తి హీనుల
మంచు యేసుని శక్తి నమ్మలేదా యా యుక్తసహాయము దొరకువరకా
సక్తి నుండలేదా ||జడియకుము||
jadiyakumu nae nae yunnaanani kadu nenaru vaakkichchina yaesuni
yadugujaadalu veMbadiMchi naduchukonaraadhaa jeevaa yiduma laDhikamu
galigina prabhuni kadakuAO jaeraraadhaa ||jadiyakumu||
1. ippudu ninu baaDhaparachedi muppulM dhalapoasi thappaka goppa praemaarThMpu
shikShku noppiyuMdaraadhaa nee thappulan vidi prabhuvu nMdhu meppu
boMdharaadhaa ||jadiyakumu||
2. ghanamu Dhanamu saukhyMbu boayi vyasanamu shoaDhana munna yoabu
manasu dhruDamu chaesi prabhuni mahima parapalaedhaa nee manasu
dhruDMbatula jaesi mahima paraparaadhaa ||jadiyakumu||
3. beedha laajaruMdu bhuvini baaDha noMdhina saadhrushyMpu boaDhana nee
maanasamuna paadhukonalaedhaa yathAO daadhariMpAObadina viDhamu
moadha miyyalaedhaa ||jadiyakumu||
4. munnu saiphnunu raaLlathoaAO gottu chunna pagathura koraku dhaevuni minnu
vaipunAO joochi yoarchi manna nadugalaedhaa nee kunna shramalatu loarchAO
brabhuvu thennuAO joopalaedaa ||jadiyakumu||
5. bhaktha janulanu khaidhuku needchi baaDhalu gaaviMchinappudu shakthi heenula
mMchu yaesuni shakthi nammalaedhaa yaa yukthasahaayamu dhorakuvarakaa
sakthi nuMdalaedhaa ||jadiyakumu||