manasu nichchi vinumaa madhi nమనసు నిచ్చి వినుమా మది ననుసరిం
Chords: ragam: కమాను-kamaanu
మనసు నిచ్చి వినుమా మది ననుసరించి చనుమా ||మనసు||
1. అరయ యేసు సిలువ యది అమరపురికి త్రోవ ఆ రమ్యమైన త్రోవ
యది యనుసరించినావ అది యరసి చూచినావ? ||మనసు||
2. అది నడచి నడచి పోను ఆనందమిచ్చి చనును అది యేసు సిలువ
మ్రాను అది యనుసరింపదగును అది యందరు చనదుగును ||మనసు||
3. రక్తమయపు బాట నీ ముక్తికదియె యూట భక్తులందరి యెదుట స
ద్భక్తి మెరయు పాట లనురక్తి బాడెదరచట ||మనసు||
4. ఎంత పాపమైన మదికెంత భారమైన ఎంత దయయోగాని యది
ఎంత కృపయొ గాని అతి శాంతి నిచ్చులోన ||మనసు||
5. సాటిలేనిదారి మన స్వామిచూపుదారి మేటికల్వరిదారి జనకోటి
దుర్గుణహారి మనకోటకు రహదారి ||మనసు||
6. వలదులోకమేల నీ వలపు నా కికేల నిలువుమింక చాలు నని
బిలుచు యేసుమ్రోల నే గొలుతు కాలమెల్ల ||మనసు||