• waytochurch.com logo
Song # 273

bethlehem puramuna chithrambu kalige బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె


బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె
కర్తాది యేసు జన్మించినపుడు
అంధకారంపు పృథివి వీధులలో
మోదంపు మహిమ చోద్యంబుగానరే

ఉదయంపు తారల్ ముదమున బాడే
ఉదయించ యేసు ఈ పృథివిలోన
ముదమును గలిగె మరి సమాధానం
పదిలంబుతోడ పూజించ రండి ||బేత్లేహేం||

పరమును విడచి నరరూపమెత్తి
అరుదెంచి యేసు పరమ వైద్యుండై
నరుల దుఃఖములన్ తొలగించివేసి
పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు ||బేత్లేహేం||

నీదు చిత్తమును నాదు హృదయమున
ముదమున జేయ మదినెంతో యాశ
నీదు పాలనము పరమందు వలెనె
ఈ ధరణియందు జరుగంగ జూడ ||బేత్లేహేం||

దేవుని సన్నిధి దీనత నుండ
పావనయాత్మ పవిత్ర పరచున్
పావనుడేసు ప్రకాశమిచ్చి
జీవంబు నొసగి జీవించు నెదలో ||బేత్లేహేం||

గతించె రాత్రి ప్రకాశించె కాంతి
వితానముగ వికసించె నెల్ల
దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు
అతి ప్రేమతోడ అరుదెంచె నోహో ||బేత్లేహేం||

Bethlehem Puramuna Chithrambu Kalige
Karthaadi Yesu Janminchinapudu
Andhakaarampu Pruthivi Veedhulalo
Modampu Mahima Chodyambuganare

Udayampu Thaaral Mudamuna Baade
Udayincha Yesu Ee Pruthivilona
Mudamunu Galige Mari Samaadhaanam
Padilambuthoda Poojincha Randi ||Bethlehem||

Paramunu Vidachi Nararoopameththi
Arudenchi Yesu Parama Vaidyundai
Narula Dukhamulan Tholaginchivesi
Paraloka Shaanthi Sthiraparache Prabhuvu ||Bethlehem||

Needu Chiththamunu Naadu Hrudayamuna
Mudamuna Jeya Madinentho Yaasha
Needu Paalanamu Pramandu Valene
Ee Dharaniyandu Jaruganga Jooda ||Bethlehem||

Devuni Sannidhi Deenatha Nunda
Paavanayaathma Pavithra Parachun
Paavanudesu Prakaashamichchi
Jeevambu Nosagi Jeevinchu Nedalo ||Bethlehem||

Gathinche Raathri Prakaashinche Kaanthi
Vithaanamuga Vikasinche Nella
Doothala Dhvanitho Pathi Yesu Kreesthu
Athi Premathoda Arudenche Noho ||Bethlehem||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com