• waytochurch.com logo
Song # 2734

emdhu kae chimthimchedhavu naaఎందు కే చింతించెదవు నా డెందమా


Chords: ragam: సావేరి-saavaeri

ఎందు కే చింతించెదవు నా డెందమా నీ కందమా యిందాఁక
రక్షించినవాఁ డిఁకను నిన్ను విడువఁబోడు ||ఎందుకే||

1. తొల్లి నీ వొనరించినట్టి దోషమెంతో యరిసి చూడు చెల్లచెదరై పఱచు
తరిని చెయ్యి పట్టినాఁడు అల్లుకొనిన నీ దుర్గణము లణఁగఁ ద్రొక్కి
వేసినాఁడు తల్లడిల్లజేయు నీ శత్రువులఁ దరిమి ప్రోచినాఁడు నల్లగా
దన్నాడా నేఁడు వద్దు సందేహంబులు వీడు ||ఎందుకే||


2. తల యెత్తరాని చోటఁ గళ లిచ్చి నిలిపినాఁడు పలుమారు నీ యక్కఱలు
తెలిసి యందిచ్చినాఁడు బలహీన మపుడు నీకు ని ర్భయ మియ్య
వచ్చెడు వాఁడు పలు విధంబు లగు బాధలఁ బారఁ దోలివేసినాఁడు
నెల విప్పుడు లేదన్నాఁడా నీతో నిఁక సరి యన్నాఁడా ||ఎందుకే||


3. ఒక్క నీ తల వెండ్రుక యైన నూడిపడ దని చెప్పెడు వాఁడు దిక్కు నీకిక
నేనే యని తన దివ్య వాక్కులఁ దెలిపెడు వాఁడు చిక్కు లను బెట్టెడు
పగవారి చేత నినుఁ జిక్కింపని వాఁడు ఇక్కట్టు మెట్టుల దాఁటించుట
కిదిగో యని చెయి యిచ్చెడు వాఁడు హక్కు లేదన్నాఁడ నేడు అతఁడు
నిను వెలి వేయబో డు ||ఎందుకే||


4. యేసు తన రక్తముతో నిన్ను నెంచి ముందే కొనుచున్నాఁడు దోసములు
వెడలించు విమలా త్ముండు నీ సాక్షిగ నున్నాఁడు ఆశతో నీవు గొలిచెడు
తండ్రి యంతటా గాపై యున్నాఁడు నీ సురక్షణ జేయు వారు నినుఁ
జుట్టి యున్నా రెల్లప్పుడు శేషరహితానంద మల్లెదె. చేరువగుచున్నది
చూడుము ||ఎందుకే||

eMdhu kae chiMthiMchedhavu naa deMdhamaa nee kMdhamaa yiMdhaaAOka
rakShiMchinavaaAO diAOkanu ninnu viduvAOboadu ||eMdhukae||

1. tholli nee vonariMchinatti dhoaShmeMthoa yarisi choodu chellachedharai paRachu
tharini cheyyi pattinaaAOdu allukonina nee dhurgaNamu laNAOgAO dhrokki
vaesinaaAOdu thalladillajaeyu nee shathruvulAO dharimi proachinaaAOdu nallagaa
dhannaadaa naeAOdu vadhdhu sMdhaehMbulu veedu ||eMdhukae||


2. thala yeththaraani choatAO gaLa lichchi nilipinaaAOdu palumaaru nee yakkaRalu
thelisi yMdhichchinaaAOdu balaheena mapudu neeku ni rbhaya miyya
vachchedu vaaAOdu palu viDhMbu lagu baaDhalAO baarAO dhoalivaesinaaAOdu
nela vippudu laedhannaaAOdaa neethoa niAOka sari yannaaAOdaa ||eMdhukae||


3. okka nee thala veMdruka yaina noodipada dhani cheppedu vaaAOdu dhikku neekika
naenae yani thana dhivya vaakkulAO dhelipedu vaaAOdu chikku lanu bettedu
pagavaari chaetha ninuAO jikkiMpani vaaAOdu ikkattu mettula dhaaAOtiMchuta
kidhigoa yani cheyi yichchedu vaaAOdu hakku laedhannaaAOda naedu athAOdu
ninu veli vaeyaboa du ||eMdhukae||


4. yaesu thana rakthamuthoa ninnu neMchi muMdhae konuchunnaaAOdu dhoasamulu
vedaliMchu vimalaa thmuMdu nee saakShiga nunnaaAOdu aashathoa neevu golichedu
thMdri yMthataa gaapai yunnaaAOdu nee surakShNa jaeyu vaaru ninuAO
jutti yunnaa rellappudu shaeShrahithaanMdha malledhe. chaeruvaguchunnadhi
choodumu ||eMdhukae||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com