bhayamu nomdhakumu kraisthava భయము నొందకుము క్రైస్తవ సహోదర య
భయము నొందకుము క్రైస్తవ సహోదర యింక భయము నొంద
కుము భయము నొందకుము హృదయ వాసుఁడగు క్రీస్తు దయ నీ
తలఁపు లెల్ల రయముగ నెరవేర్చు ||భయము||
1. దీవింపఁబడెడు జగమున కిరుకౌ త్రోవ జను నపుడు భావ జ్ఞానము
వీడ భయపుఁ జీఁకటి గూడుఁ గావున మది యేసు భావింప గతి జేర్చు
||భయము||
2. నీ యాత్మఁ జూచి కయ్యము జేయ డాయు పిశాచి యా యుద్ధమున
బ్రత్య య మ్మనెడు డాల్బట్ట నా యెడఁ గ్రీస్తు స హాయుఁడై గెల్పించు
||భయము||
3. జగము నిన్బట్టి వెన్కకు నీడ్చి పగఁ దీరఁ గట్టి యెగతాళి గావించు
టెఱింగి క్రీస్తుని పిల్వఁ డగఁబట్టు మపుడు నీ పగ మాన్పి విడిపించు
||భయము||
4. కలుష జాలంబు మాయా కీట కముల జాలంబు గల బావి నీ
యాత్మ గలియకుండఁగ యేసుఁ దలఁచు మప్పుడు నిం జే తంబట్టి
కాపాడు ||భయము||
5. శ్రమ దండనముల శిశు శిక్షించు జనకు విధముల సమకూర్చు నీ
దేవుఁ డమిత ప్రేమను గాంచి యమలమౌ మతి నోర్చు మపుడు
మేలిడు నీకు ||భయము||
6. కన నీదు చటుల దుఃఖాదు లె ట్లను వీడు నటులఁ గొన దినమున
న్యాయ మును దీర్పఁగాఁ క్రీస్తు చను దెంచి నిత్య జీ వన కిరీటము
నిచ్చు ||భయము||
bhayamu noMdhakumu kraisthava sahoadhara yiMka bhayamu noMdha
kumu bhayamu noMdhakumu hrudhaya vaasuAOdagu kreesthu dhaya nee
thalAOpu lella rayamuga neravaerchu ||bhayamu||
1. dheeviMpAObadedu jagamuna kirukau throava janu napudu bhaava jnYaanamu
veeda bhayapuAO jeeAOkati gooduAO gaavuna madhi yaesu bhaaviMpa gathi jaerchu
||bhayamu||
2. nee yaathmAO joochi kayyamu jaeya daayu pishaachi yaa yudhDhamuna
brathya ya mmanedu daalbatta naa yedAO greesthu sa haayuAOdai gelpiMchu
||bhayamu||
3. jagamu ninbatti venkaku needchi pagAO dheerAO gatti yegathaaLi gaaviMchu
teRiMgi kreesthuni pilvAO dagAObattu mapudu nee paga maanpi vidipiMchu
||bhayamu||
4. kaluSh jaalMbu maayaa keeta kamula jaalMbu gala baavi nee
yaathma galiyakuMdAOga yaesuAO dhalAOchu mappudu niM jae thMbatti
kaapaadu ||bhayamu||
5. shrama dhMdanamula shishu shikShiMchu janaku viDhamula samakoorchu nee
dhaevuAO damitha praemanu gaaMchi yamalamau mathi noarchu mapudu
maelidu neeku ||bhayamu||
6. kana needhu chatula dhuHkhaadhu le tlanu veedu natulAO gona dhinamuna
nyaaya munu dheerpAOgaaAO kreesthu chanu dheMchi nithya jee vana kireetamu
nichchu ||bhayamu||