sharanuao jochchithi yaesunaadశరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్త
Chords: ragam: కేదారగౌళ-kaedhaaragauL
శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె నా దరణ మిమ్మిల
నెవ్వఁ బొందితి దవ్వుసేయక కావవే ||శరణు||
1. కరుణఁ జూడుము కన్న తండ్రివి కల్మషం బెడఁబాపవే మరణ మొందక
మున్ను నన్నిల మార్పు నొందఁగఁ జేయవే ||శరణు||
2. మొరను జెచ్చెర నాలకించుచు మోము నా దెసఁ జూపవే యురు
పదంబుల సేవఁ జేసెద నుద్ధరించుము కూర్మితో ||శరణు||
3. తామస క్రియలందు వాంఛలు తాకకుండగఁ జేయవే క్షేమమైన సువార్త
బోధల సిద్ధపడి విననీయవే ||శరణు||
4. శ్రమలు చాల కల్గి యున్నను సైఁప నేర్పుము సత్కృపన్ గమిలి పోయెడి
మాయ లోకపు గాంతి నీరస మంచు నీ ||శరణు||