naadhaa samuyaelu reethi nee yaamoadha shనాధా సముయేలు రీతి నీ యామోద శ
1. నాధా! సముయేలు రీతి
నీ యామోద శబ్దము
సేవకుఁడ నైన నన్ను
నాతో డాలకింపనీ
నాతో నీవేమందువో
నే నాలించువాఁడను.
2. నీ మాట గ్రహించునట్లు
దానిఁ దేటపర్చుము
నిన్ను వెంబడించునట్లు
నిబ్బరింపఁ జేయుము
నేను నీదు గొఱ్ఱెను
'బండ నీడలో మేపు'
3. నేను స్వల్పశిష్యుడను
నన్ నిరాకరింపకు
నిన్నాలింప నెంత యాశ
నీ వెఱింగి యుందువు
ఆత్మ యక్కరల్ తీర్చు
ధన్యుఁడన్ నే నౌదును
4. నాధా, నీ శబ్ద మాలింప
నన్ను సిద్ధపర్చుము
నీదుమాట లక్ష్య పెట్టి
నిత్యసేవఁ జేయనీ
నాతో నీవేమందువో
నే నాలించువాఁడనే.
1. naaDhaa! samuyaelu reethi
nee yaamoadha shabdhamu
saevakuAOda naina nannu
naathoa daalakiMpanee
naathoa neevaemMdhuvoa
nae naaliMchuvaaAOdanu.
2. nee maata grahiMchunatlu
dhaaniAO dhaetaparchumu
ninnu veMbadiMchunatlu
nibbariMpAO jaeyumu
naenu needhu goRRenu
'bMda needaloa maepu'
3. naenu svalpashiShyudanu
nan niraakariMpaku
ninnaaliMpa neMtha yaasha
nee veRiMgi yuMdhuvu
aathma yakkaral theerchu
DhanyuAOdan nae naudhunu
4. naaDhaa, nee shabdha maaliMpa
nannu sidhDhaparchumu
needhumaata lakShya petti
nithyasaevAO jaeyanee
naathoa neevaemMdhuvoa
nae naaliMchuvaaAOdanae.