నేను నిన్ను ఎన్నడు విడువను
nenu ninnu ennadu viduvanu
పల్లవి~:- నేను నిన్ను ఎన్నడు విడువను - నేను నిన్ను ఎన్నడు ఎడబాయను1. తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మరచునా ? వారైన పిల్లలను మరతురు గాని నేను నిన్ను ఎన్నడు మరువను2. నీ దుఃఖములో నేను దుఃఖించుచు వాటిని భరింతున్ నీ ఆనందములలో నేను ఆనందించుచు నీతో కలసి ఉల్లసింతును3. యుగసమాప్తి వరకు మీతో కూడ ఉండి ఆత్మతోడ నడిపింతున్ కనుపాపవలె నిన్ను సురక్షితుని చేసి దుష్టత్వము నుండి కాపాడెదన్4. నీవు నన్ను ఘనపరచి భయముతోడ నడచి యధార్థత చూపితివి కావున దీవెనల ఊట నీ పై కుమ్మరించి నా దక్షిణ హస్తముతో ఆదుకొందును