o priya sodharuda o priya sodhari etu ఓ ప్రియ సోదరుడా ఓ ప్రియ సోదరి ఎటు
ఓ ప్రియ సోదరుడా ఓ ప్రియ సోదరి ఎటు నీ ప్రయాణము? ఏది నీ గమ్యము? 1. ఇలలో నున్న సమస్తమును నిలువని వని నీవెరుగుదువా (2)విలువైన రక్షణను ఉచితముగా నీకు అను గ్రహించును యేసు (2)2. పరుగులు తీయుచూనున్నావు పరి పరి విధములుగా నీవు (2)ధన ఘనతల కొరకు పేరు ప్రఖ్యాతులకు నిత్యమైన వాటిని చూడక (2)3. పాపము చేయు వారేల్లరిన్ పట్టుకొనును పాతళము (2)పరిశుథూలందరును ప్రభు యేసు సన్నిధిలో పరలోకములో నుందురు (2)4. అందరి కొరకు ప్రభు యేసు చిందించెను తన రక్తమును (2)మన పాపము కడిగి శుద్ధులుగా చేసి పరలోక రాజ్యం నివ్వ (2)5. కొంతకాలంబే ఈ జీవితము అంతము ఎపుడో తెలియదుగా (2)ఎంతో ప్రేమించిన యేసుని అంగీకరించిన వింతగా మారెదవు (2)