prabhuni smarinchu prabhuni smarinchu ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు
ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు
ఓ మనసా! నా మనసా! (2)
నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు (2)
నీ మహిమే మేటి (3) || ప్రభుని ||
ప్రభూ నీ శరణాగతులగువారు (2)
విడుదల నొందెదరు (3) || ప్రభుని ||
పాపుల కొరకై సిలువను మోసి (2)
ప్రాణంబిడె నిలలో (3) || ప్రభుని ||
మా ప్రభువా మా మొరనాలించి (2)
నీ జ్ఞానంబిమ్ము (3) || ప్రభుని ||