• waytochurch.com logo
Song # 27525

nyaayaadhipathiyaina devudu ninnu piliche velalona న్యాయాధిపతియైన దేవుడు నిన్ను పిలిచే వేళలోన


న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన
ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2)
ఒక గుంపేమో పరలోకపు గుంపు
రక్షింపబడిన వారికే అది సొంతం
మరు గుంపేమో ఘోర నరకపు గుంపు
నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం ||న్యాయాధిపతి||

నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది
కాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది (2)
కలువరిలో తన ప్రాణం పెట్టిన
యేసయ్యే నీ ప్రాణ రక్షణ
సిలువలో క్రయ ధనమే చెల్లించిన
ఆ ప్రభువే నీ పాప విమోచన ||ఒక గుంపేమో||

ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకు
ఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు (2)
మేఘముపై రానైయున్నాడుగా
త్వరలోనే నిను కొనిపోడానికి
వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా
నీ హృదిలో స్వీకరించడానికి ||ఒక గుంపేమో||

nyaayaadhipathiyaina devudu – ninnu piliche velalona
ye gumpulo untaavo thelusuko – maralaa vachche velalona (2)
oka gumpemo paralokapu gumpu
rakshimpabadina vaarike adi sontham
maru gumpemo ghora narakapu gumpu
nija devuni erugani vaariki adi antham ||nyaayaadhipathi||

neevu kaadu nee kriyalu kaadu – aa paramuku ninu cherchedi
kaadu kaadu verevaro kaadu – maranamunu thappinchedi (2)
kaluvarilo thana praanam pettina
yesayye nee praana rakshana
siluvalo kraya dhaname chellinchina
aa prabhuve nee paapa vimochana ||oka gumpemo||

idiye samayam ika lede tharunam – nee paapamu oppukonutaku
aa paralokam chere maargam – yesegaa prathi okkaraku (2)
meghamupai raanaiyunnaadugaa
thvaralone ninu konipodaaniki
venudeeyaku o naa priya nesthamaa
nee hrudilo sweekarinchadaaniki ||oka gumpemo||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com