inthavaraku neevu nannu nadipinchutaku ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు
ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు
నేనేమాత్రము నా జీవితం ఏమాత్రము
ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు
నేనేమాత్రము మేము ఏమాత్రము
నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే
నే చూచు ఘనకార్యములు నీ దయవలెనే
1. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని
హెచ్చించితివే నన్ను ఎందుకని
మందను వెంటాడి తిరుగుచుంటినే
సింహాసనం ఎక్కించి మైమరచితివే
2. నా ఆలోచనలన్ని చిన్నవని
నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని
తాత్కాలిక సహాయము నే అడిగితిని
యుగయుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే