Deevinchaave Samruddiga దీవించావే సమృద్ధిగా
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమనిదారులలో.. ఏడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే సమృద్ధిగా||1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యానీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావేనే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)ఊహలలో.. నా ఊసులలో..నా ధ్యాస.... బాసవైనావే..శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే సమృద్ధిగా||2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యానా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2) ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే సమృద్ధిగా||