aakaasha veedhullo aanandham aa ningi thaarallo ullaasam ఆకాశ వీధుల్లో ఆనందం ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఆకాశ వీధుల్లో ఆనందం – ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఈ రేయి వెన్నెల్లో సంతోషం – ఇలా పొంగేను లోలోన సంగీతం
లోకాలకే రారాజుగా – యేసయ్య పుట్టాడుగా
లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య
దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య
ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక
మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ
దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ
చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే
వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే
సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం
సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం
2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను
పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను
వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో
అంతులేని చింతలేని పరమునే పొందుకో
సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె