Velasenule gaganaana thoorpu thaara nisidhi reyi jaamulo వెలసెనులే గగనాన తూర్పుతార నిశీధిరేయి జాములో
వెలసెనులే గగనాన తూర్పుతార – నిశీధిరేయి జాములో
కురిసెనులే జగాన ప్రేమధార – రక్షకుడేసు జన్మలో
క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే – ప్రభుయేసే జన్మించగా
కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే – దీనులు ధన్యులాయెనే
“శుభవార్త దూతదెల్పగ – ఆ గొల్లలే గంతులేసేనే
లోకాన రక్షణానందమే – పరలోకానా సంగీతమాయెనే ”
తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు – తీరాలు దాటి నిను చూడగా
బంగారు సాంబ్రాణి బోళములర్పించి – నమస్కరించి పూజించిరి
రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని
జగాలనేలే జయశీలుడేసే – జీవాధిపతిగా జనియించెనే
శరీరధారై పరిశుద్ధుడేసే – పశుశాలలోన పవళించెనే
జయగీతం పాడి – కీర్తించి కొనియాడెదము
మా పాపభారం భరియించెనే – మా ధుఃఖ్ఖ దోషం తొలగించెనే
మన్నించి మమ్ము క్షమియించెనే – కరుణించి మాపై కృపచూపునే
మనసున్న మహారాజై – మా మదిలో ఉదయించెనే
velasenule gaganaana thoorpu thaara – nisidhi reyi jaamulo
kurisenule jagaana premadhaara – rakshakudesu janmalo
christmas kaanthule lokaana veligene – prabhuyese janminchagaa
kanyaku putte nedu parshuddhude – dheenulu dhanyulaayane
shubhavaartha dhootha dhelpagaa – aa gollale ganthulesene
lokaana rakshanaanandhame – paralokaanaa sangeethamaayene
tharinchipoye aa thoorpu gnaanulu – theeraalu dhaati ninu choodagaa
bangaaru saambraani bholamularpinchi – namaskarinchi poojinchiri
raaraaje rakshakudai manakosam janminchenani
jagaalanele jayaseeludese – jeevadhipathigaa janiyinchene
sareeradhaarai parishuddudese – pasusaalalona pavalinchene
jaya geetham paadi – keerthinchi koniyaadedhamu
ma paapa bhaaram bhariyinchene – maa dhukka dhosham tholaginchene
manninchi mammu kshaminchene – karuninchi maapai krupa choopene
manasunna maharaajai – maa madhilo udhayinchene