ఆకాశగగనాన మెరిసింది తారక
Akasa gaganana mersindhi taraka
ఆకాశగగనాన మెరిసింది తారక
యేసయ్య ఉదయించాడనీ " 2 "
ఆయనే లోక రక్షకుడు
ఆయనే పాప విమోచకుడు " 2 "
బంగారు బోళము సాంబ్రానులను
అర్పించేదం హ్యాపీ క్రిస్మస్
గొల్లలు జ్ఞానులు ఏతెంచి వచ్చిరి
చేద్దామా మేరి క్రిస్మస్ " 2 "
*" ఆకాశగగనాన "*
*1 )* బెత్లహేము నగరాన
కన్య మరియ గర్భాన
పశులపాకలో పవలించాడు యేసయ్య " 2 "
వేలాది దూతల గాణప్రతి గాణములతో
కోట్లాది దూతల సైన్య సమూహముతో " 2 "
నాకోసమే భువికేతెంచెను
నజరేతు వానిగా " 2 "
*" ఆకాశగగనాన "*
*2 )* గాబ్రియేలు దేవ దూత
తెలిపెను ఒక శుభవార్త
సర్వ మానవాళికి సంతోషము కలుగునని "2"
రారండి చేద్దాము ఉత్సాహ ఆర్భాటములతో
మనసారా కొనియాడి కీర్తించి స్తుతియించెదము " 2 "
మన కోసమే భువికేతెంచెను నజరేతు వానిగా
*" ఆకాశగగనాన "*