sakalaaseervaadhamula kaarannabhuutuhdaa సకలాశీర్వాదముల కారణభూతుడా
సకలాశీర్వాదముల కారణభూతుడా
యేసూ నా ప్రియుడా
నీ మేలుల తలంచుచుండ
స్తుతి గానమే పెదవుల నిండా
జయశీలుడా విభుడా
పరిపూర్ణుడా హితుడా
1. అన్నపానం లోటు రానీకుండా
కార్యము చేసిన పోషకుడా
ఆరోగ్యములను కుదుటపరచి
ఆయుష్షు పెంచేవాడా
2. జీవమార్గం తప్పిపోనీకుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా
ఆటంకములను అనువుపరచి
ఆకాంక్ష తీర్చేవాడా
3. కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా
ఆదాయములను పదిలపరచి
ఆధిక్యమిచ్చేవాడా