chakkani baaludamma chuudachakkangaa unnaadammaa చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మా
చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మా
కన్నీయ మరియమ్మ ఒడిలోన
భలే బంగారు బాలుడమ్మ
గొల్లలంతా గొప్ప దేవుడంటు – కూడినారు పశులపాకలో
జ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ – చేరినారు బెత్లహేములో
బంగారు సాంబ్రాణి బోలములు అర్పించి ఆరాధించిరి
లోక రక్షకుడు మా రారాజని కీర్తించి కొనియాడిరి
నింగిలోన పరిశుద్ధులంతా ప్రభువును స్తుతియించిరి
బెత్లెహేము పురములోన భక్తులంతా పూజించిరి
సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ
అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి