paata paadaala vaadyamu mrogaala పాట పాడాలా వాద్యములు మ్రాగాల
పాట పాడాలా వాద్యములు మ్రాగాల
వేడుకలు చేసుకోవాలా
అందరూ ఒక్కటై ఉత్సహించాల
రాజుల రాజునకు భజన చేయాలా
కారణ జన్మునికి మహిమ చెందాల
1.పొందిన మేళ్లను మరుగు చేయక
అందరి ముందర సాక్ష్యమివ్వాలా
మానవుని ప్రేమించి నాశనము తప్పించే
రక్షకుని స్వంతమవ్వాలా
2.దేనిని గూర్చియు దిగులు చెందక
భారము యేసుకు అప్పగించాల
ధైర్యమును రప్పించి ప్రాణమును దక్కించే
భీకరుని ఆశ్రయించాలా
3.లోకము వైపుకు కనులు త్రిప్పక
దేవుని నీతిపై దృష్టి ఉంచాలా
వాక్యముతో సంధించి క్షేమముతో పంపించే
శ్రీకరుని సన్నుతించాల