neevae naa priyuaodavu yaesu pనీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు
నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవే
యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి ||నీవే||
1. పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన నా
కొరకు విడిచితివి ||నీవే||
2. నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల
సిలువపై ||నీవే||
3. నేనెవరిఁ బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ
ప్రేమ నాకర్త ||నీవే||
4. నీ సేవ నేఁ గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుఁడ నైన నే నెట్లు నిను
విడుతు ||నీవే||
5. సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కఁగం చేయుదువు
||నీవే||
6. నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు
||నీవే||
neevae naa priyuAOdavu yaesu prabhu neevae naa yodayuAOdavu neevae
yanaadhi dhaeva puthruMdavu neevae loaka mella naerpugAO jaesithivi ||neevae||
1. paramMdhu neekuMdu paramabhaagyMbulu narakaayaththuAOda naina naa
koraku vidichithivi ||neevae||
2. neevae nanuAO broava nenaru naetheMchi neevoluka boasithivi nee nalla
siluvapai ||neevae||
3. naenevariAO braemiMthu nee kMte loakamuna nae nepudu maruvanu nee
praema naakartha ||neevae||
4. nee saeva naeAO goari ninnae prathiparathu nee saevakuAOda naina nae netlu ninu
viduthu ||neevae||
5. sakalMbu naeledi chakkani raajavu sakalaaDhikaarMbu chakkAOgM chaeyudhuvu
||neevae||
6. nee saevakula nella naerpugaa naeledhavu nee saevakulu poMdha nithya sahaayMbu
||neevae||