aanandam aanandamea raaraaju putteanani ఆనందం ఆనందమే రారాజు పుట్టేనని
ఆనందం ఆనందమే రారాజు పుట్టేనని
సంతోషం సంతోషమే రక్షకుడు పుట్టేనని
రాజుల రాజై పరమును వీడే
దీనుడై రక్షింప వచ్చె
హ్యాపీ హ్యాపీ… మెర్రీ మెర్రీ…
హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్
1.
దూతలు వచ్చిరి – వార్తను తెచ్చిరి
గొల్లలు వచ్చిరి – నాట్యమాడిరీ
జ్ఞానులు వచ్చిరి – ఆరాధించిరి
యేసే రక్షకుడని – చాటి చెప్పిరి
హ్యాపీ హ్యాపీ… మెర్రీ మెర్రీ…
హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్
2.
దావీదు పట్టణములో ఆరోజు జన్మించెను
ఈరోజు నీ ఇంటిలో జన్మింప కోరుచున్నాడు
నీ పాపము మోయ – నీ నిందను మాన్పా
ఆ యేసు వచ్చె ఓరన్నా
సంతోషమునివ్వ – నిత్యజీవమియ్య
నీ కొరకే వచ్చె ఓరన్నా ఓ ఓ ఓ …
హ్యాపీ హ్యాపీ… మెర్రీ మెర్రీ…
హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్