kreesthu puttenu hallelooyaa క్రీస్తు పుట్టెను హల్లెలూయా
క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2)
జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను (2)
చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె (2)
నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో…
ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే (2)
చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య
పాప శాపముతో నిండియుండగా
యేసు అడుగు పెట్టెను
ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను (2) ||చీకు చింత||
గెరాసేను జనములలో కొందరు
రోగాలు దయ్యాలతో బాధనొందగా
యేసు అడుగుపెట్టెను
ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను (2) ||చీకు చింత||
మరణమాయె యాయీరు కూతురు
వేదన రోదన కన్నీటిలో
యేసు అడుగుపెట్టెను
ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను (2) ||చీకు చింత||
వేదనతో నలిగిపోవుచున్నావా
యేసు నీ కొరకై ఉదయించెను
లెమ్ము తేజరిల్లుమ్ము
నీ ఇంటికి – వెలుగు వచ్చియున్నది (2) ||క్రీస్తు పుట్టెను||
kreesthu puttenu hallelooyaa (2)
jagamanthaa pandugaayenu – sarvalokaaniki sandadaayenu (2)
cheeku chintha veedipoye – cheekatantha tholagipoye (2)
navya kaanthulegase ilalo – divyakaanthudesu raakatho…
ullaasame uthsaahame – jagamanthaa jayothsaahame (2)
chettekkina lanchagondi jakkayya
paapa shaapamutho nindiyundagaa
yesu adugu pettenu
aa intilo – rakshana kaanthule virajillenu (2) ||cheeku chintha||
geraasenu janamulalo kondaru
rogaalu dayyaalatho baadhanondagaa
yesu adugu pettenu
aa oorilo – vidudala kaanthule prakaashinchenu (2) ||cheeku chintha||
maranamaaye yaayeeru koothuru
vedana rodana kanneetilo
yesu adugu pettenu
aa intilo – jeevapu kaanthule prajwalillenu (2) ||cheeku chintha||
vedanatho naligipovuchunnaavaa
yesu nee korakai udayinchenu
lemmu thejarillumu
nee intiki – velugu vachchiyunnadi (2) ||kreesthu puttenu||