ninu vidichi na hrudhayam parithapinche nee kosamu నిను విడిచి నా హృదయం పరితపించే నీ కోసమే
Verse 1:
నిను విడిచి నా హృదయం పరితపించే నీ కోసమే
నేనంటే నీవేకదా నీవు లేక నే లేనయ్యా
నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి
నీ సత్య మార్గమందు నడిపితివి
Chorus:
నాన్నా… నాన్న…నీ కుమారుడను నేను
నాన్నా… నాన్న…నీ కుమార్తెను నేను
Verse 2:
నిను విడిచి ఎటు పోదును
నీవే నా ఆశ్రయపురము
ఎప్పటికీ ఎరుగనైతిని నీ కుమారుడను నేనని
నీ కంటిపాపగా నన్ను కాచితివి
నీ చేతి నీడలో నాకు కాపుదలయ్య
Tag:
నీ కనుపాపనై నేను నాన్న..ఆ.. ఆ
Bridge:
త్రోసివేయలేదు తృణీకరించలేదు
అవమానము నుండి విడిపించినావు నన్ను
త్రోసివేయలేదు తృణీకరించలేదు
అవమానము నుండి కాపాడితివి నన్ను
హత్తుకుని ముద్దాడితివి నాన్న
ఆటంకము తొలగించి ఆదరించినావు
Tag 2:
నీ ప్రతి రూపము నేను నాన్న
నీ ప్రతి రూపము నేను నాన్న