aa madhya raathrilo bethlehemu puramulo ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో
Scale-Am, Sig-3/4 waltz, Tempo-135
ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో
పశువుల శాలలో ప్రభుయేసు జన్మము
జగమే వెలుగై నిండినరాత్రి
చీకటి తొలగి పోయినవేళ
దేవుడే మనకు తోడుండగా
దేవుని ప్రత్యక్షతలు లేని కాలములో
దేవుని స్వరమే వినబడని చీకటి కాలములో
నిరాశలో జనులందరు
మెస్సయ్య కోసమే ఎదురు చూసిన వేళ
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను
దేవుని పరిశుద్ధ ఆలయము అపవిత్రమైన వేళలో
జనులెవ్వరు బలియార్పణలు అర్పించని కాలములో
నిరాశలో జనులందరు
మెస్సయ్య కోసమే ఎదురు చూసిన వేళ
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను
కాలము సంపూర్ణమైన ఆ వేళలో
పరలోక మహిమను విడచి మనుజావతారునిగా
దిగివచ్చెను పరమాత్ముడే
మనపాప శాపములను తీసివేయుట కోసం
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను