naa thodugaa neevu nee needalo nenu నా తోడుగ నీవు నీ నీడలో నేను
నా తోడుగ నీవు – నీ నీడలో నేను
కలకాలం ఉండాలనీ
నీతోనే నేను రానా – నీతోనేనుండిపోనా
యేసయ్యా యేసయ్యా
స్తుతి ఘన మహిమలతో
నిన్నే ఆరాధించెదను
పునరుత్థానుడా నా యేసు ప్రభువా
చూపించితివి నీ జీవమార్గము
సాగిపోయెదను నీ వాక్యపు వెలుగులోనే
నాలో నివసించి సంచరించి
అంతరంగమును పరిశుద్ధపరచి
నూతన పునాది వేసితివి
నీ ఆలయముగ మార్చితివి
ముందెన్నడులేని ఆనందముతో
ఉప్పొంగుచున్నది నాహృదయమెంతో
నీవిక నేమాత్రము
కన్నీళ్లు విడువవంటివే