nanu yedabaayaka padipooneeyaka podiginchithivi naa jeevamu నను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము
నను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము
బ్రతికించే కదా నీ వాత్సల్యము
నీకే కృతజ్ఞత స్తోత్రము
దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును
నను ఎడబాయక
1. నీ మంచితనము చూపించుచు కాచితివి గతకాలము
నిలబెట్టగోరి శేషంగా నను
రక్షించితివి ఆశ్చర్యముగను
దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును
నను ఎడబాయక
2. ఆటంకములను దాటించుచు
చేసితివి అనుకూలము
సమకూర్చి అన్ని క్షేమం కొరకును
హెచ్చించితివి అనూహ్యముగను
దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును
నను ఎడబాయక
3. నా సంకటములో ఓదార్చుచు చూపితివి ఉపకారము
నెరవేర్చి గొప్ప ఉద్దేశ్యములను
దర్శించితివి ఆప్యాయముగను
దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును
నను ఎడబాయక