dinamulu gaduchuchundagaa nee melutho thrupthi parachithivi దినములు గడుచుచుండగా నీ మేలుతో తృప్తిపరచితివి
దినములు గడుచుచుండగా నీ మేలుతో తృప్తిపరచితివి
జనములు చూచుచుండగా నీ వాగ్దానము నెరవేర్చితివి
ఎల్షద్దాయ్ దేవుడా స్వరమెత్తి నిన్ను పాడెదన్
ఎల్షద్దాయ్ దేవుడా స్వరమెత్తి నిన్ను పొగడెదను
ఆరాధనా నీకై అలాపన
స్తుతి అర్పణ నీకై నీరీక్షణ \దినములు\
యోగ్యత అర్హత లేని నన్ను ఎన్నుకొంటివి
నీ సువార్తను చాటగా జీవవాక్కుతొ నింపితివి \2\
నా కన్నీటిని నీదు బుడ్డిలో దాచుకొంటివి ప్రియ ప్రభువా
చాటెదన్ నీ నామము నాలో ప్రాణమున్నంత వరకు \అరాధనా\
శాంతినీ సమృద్ధినీ క్షేమమును నొసగితివి
దుష్టుని జయింప ఆత్మ శక్తితొ నింపితివి \2\
బలహీనతలో బలమునిచ్చి ఆదుకొంటివి ప్రియ ప్రభువా
అంతయు నీ దయా నీ కృపా దానమే \అరాధనా\