నీవే నీవే నీవే మా ప్రాణం
యేసు నీవే నీవే మా గానం
ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య
కొలుతుము నిన్నే యేసయ్య
1. శాశ్వతమైన నీ తొలి ప్రేమ – మార్గము చూపి కాచే ప్రేమ
ఆదియు నీవే అంతము నీవే – నీ చరణములే శరణమయా
నిను పోలి ఇలలోన – ఒకరైన కానరారే
నీవు లేని బ్రతుకంతా – యుగమైనా క్షయమేగా
విలువైన వరమేగా – నీవు చూపే అనురాగం
కలకాలం విరబూసే – ప్రియమార స్నేహమే
నీ ప్రియ స్నేహం – ఆనందం
కొలుతుము నిన్నే ఆద్యంతం
2. ఊహకు మించిన నీ ఘన కార్యం – ఉన్నతమైన నీ బహుమానం
నీ కృపలోనే చూచిన దేవా – జీవనదాత యేసయ్య
కలనైనా అలలైనా – వెనువెంటే నిలిచావు
కరువైనా కొరతైనా – కడదాకా నడిచావు
ఇహమందు పరమందు – కొలువైన ప్రభు యేసు
ఎనలేని దయ చూపే – బలమైన నామమే
నీ ఘన నామం – మా ధ్యానం
కొలుతుము నిన్నే ఆద్యంతం
neeve neeve neeve maa praanam
yesu neeve neeve maa gaanam
aasrayamaina aadhaaramaina nee dhivya prema chaalayya
koluthumu ninne yesayya
1. saaswathamaina nee tholi prema – maargamu choopi kaachey prema
aadhiyu neeve anthamu neeve – nee charanamuley saranmayaa
ninu poli ilalona – okaraina kaanaraare
neevu leni brathukanthaa – yugamainaa kshayamegaa
viluvaina varamegaa – neevu choopey anuraagam
kalakaalam viraboose – priyamaara snehamey
nee priya sneham – aanandham
koluthumu ninne aadhyantham
2. oohaku minchina nee ghana kaaryam – unnathamaina nee bahumaanam
nee krupaloney choochina dhevaa – jeevana dhaatha yesayya
kalanainaa alalainaa – venuvente nilichaavu
karuvainaa korathainaa – kadadhaakaa nadichaavu
ihamandhu paramandhu – koluvaina prabhu yesu
enaleni dhaya choope – balamaina naamamey
nee ghana naamam – maa dhyaanam
koluthumu ninne aadhyantham