nee krupatho nimpina naa jeevitham నీ కృపతో నింపిన నా జీవితం…
నీ కృపతో నింపిన నా జీవితం…..
మహోన్నత సేవకే అంకితం..
నా ఊహకు అందని నీ త్యాగమే
నన్ను నీలో స్థిరపరచెను….
సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను నాపై చూపావు
అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడెద…
1. ఉన్నత స్థలములలో నన్ను నడిపించే నీదు సంకల్పము….
ఊహకు మించిన కార్యము చేయుటయే నీకే సాధ్యము…
నా మధుర గీతిక నీవేనయ్యా….
నీ మహిమతో నన్ను నింపుమయా….
2. పిలుపుకు తగినట్లు జీవించుటయే నీదు చిత్తము…..
నీతిమంతులమై మొవ్వవేయుదము
నీదు సన్నిధిలో……
నా స్తుతిమాలిక నీవేనయ్యా
నీ సిలువ నీడలో దాచుమయా….
3. అందని శిఖరముపై నన్ను నింపుటకు యాగమైతివి …..
ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై…..
నా ప్రతి ఆశ సీయోనుకే
నీ ఆలోచనతో నడుపుమయా