• waytochurch.com logo
Song # 27643

ఊహకందనంత ఉన్నతం నాపట్ల

Oohakandhanantha Unnatham


ఊహకందనంత ఉన్నతం నాపట్ల
నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా
స్థితిని పరిగణించక గతము చూడక
నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం

ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది
నాకు అనుగ్రహించబడినది

1. జారిపడ్డ చోటునే వదిలివేయక
వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది
గాయము మాన్పిన స్వస్థత కూర్చిన
దివ్య ప్రేమది యేసూ నాకు వరమది

2. దూరమైన వేళలో తడవు చేయక
పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది
రూపము మార్చిన క్షేమమునిచ్చిన
గొప్ప ప్రేమది యేసూ నాకు వరమది

3. కృంగదీయు బాధలో ముఖము దాచక
మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది
అక్కర తీర్చిన ధైర్యము నింపిన
వింత ప్రేమది యేసూ నాకు వరమది


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com