phaliyinchuta nerpayya naa yesayyaa పల్లవి ఫలియించుట నేర్పయ్య నా యేసయ్యా
పల్లవి: ఫలియించుట నేర్పయ్య నా యేసయ్యా
నీ నది తీరమున ఫలియించుట నేర్పయ్యా
నీ మందిరమున నివసించుట నేర్పయ్యా
నీ సన్నిధానమున వసియించుట నేర్పయ్యా
నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా
చరణం1. యోసేపు వలె పాపము వద్దని
దుష్కార్యములు నాకు చెందవని
నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్యా
పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా
పల్లవి: ప్రేమించుట నేర్పయ్య నా యేసయ్యా
శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్యా
బంధువులందరిని ప్రేమించుట నేర్పయ్యా
రక్త సంబంధులును ప్రేమించుట నేర్పయ్యా
అందరి కన్నా నిను ప్రేమించే మనసు ఇవ్వయ్యా
చరణం2. యోసేపు వలె భాధింపబడిన క్షమియించే మనసు నాకు ఇవ్వయ్యా
దైవ ప్రేమతో హత్తుకునే మనసు ఇవ్వయ్యా
హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్యా