maruvalenayaa nee madhurapremanu mahoopakaari మరువలేనయా నీ మధురప్రేమను మహోపకారి
మరువలేనయా నీ మధురప్రేమను మహోపకారి
చింతలేదయా నీ చెంతనుండను పరోపకారి
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యా
నీలాగా ప్రేమించేవారెవ్వరు
నీలాగా క్షమియించే హృదయమేది
నీ కృపలో నన్ను దాచితివి
నీ ప్రేమలో నన్ను పెంచితివి
నీ వాక్యము నాలో ఉంచి
నీ వెలుగులో నను నడిపితివి
యేసయ్యా….యేసయ్యా …..యేసయ్యా
నా యేసయ్యా
పచ్చికగల చోట పరుండజేసి
జీవజలపు ఊటలు నాలో ఉంచి
సమ్రృద్ధి జీవము నాకిచ్చితివి
సంతోష గానాలు పాడించితివి
నీ జీవము నాలో ఉంచి
నిత్యజీవము నాకిచ్చితివి
యేసయ్యా…..యేసయ్యా …..యేసయ్యా
నా యేసయ్యా