pathi udhayamu nee krupapondhi ప్రతి ఉదయము నీ కృపపొంది
ప్రతి ఉదయము – నీ కృపపొంది
దినమంతయు – నీ ముఖకాంతిలో
వర్ధిల్లెదను నిన్నే స్తుతించుచు
సాగిపోయెదను నిన్నే పాడుచు
నావారు అనుకున్నవారందరు
దూరాన నిలిచిన సమయములో
నీ ప్రేమే కదా చేరదీసినది
నన్నీస్థితిలో నిలిపినది కృపయేకదా
నీతోనే ఇక నా సహవాసము
నీకొరకు జీవించుట నేర్పుము
ఇక నాజీవితం నీకే అంకితం
నాధైర్యము నాబలము నీవేకదా
కరుణించి నను చేరదీసితివి
నీ సన్నిధిని విడువ నెన్నటికి
సర్వసంపదలకు నిధి నీవేకదా
అవసరములన్ని తీర్చే నాతండ్రివి