ne namme nammakamu eppatiki neeve నే నమ్మే నమ్మకము ఎప్పటికి నీవే
నే నమ్మే నమ్మకము – ఎప్పటికి నీవే
దీవెనలు కలిగిన నిను నమ్మెదన్
దీవెనలు లేకున్న నిను నమ్మెదన్
నీకే నా ఆరాధన – నిన్నే నే ఘనపరచెదన్
నీకే నా ఆరాధన – నీకే
సమస్తము తెలిసిన త్రియేకుడా
నా ముందు నడచుచు నడిపించుమా
శత్రు సైన్యములు విడిచి పోవును
నీ వాగ్ధాన శక్తి నిలిచి పోవును
ఆపద సమయములో – నిను వెదకితిన్
ఆదరణ ఇచ్చుటకు వచ్చితివి
నీ వాగ్ధనములన్నియు నెరవేరును
నీ వాక్యపు శక్తి నిలిచి పోవును
నీకే నా ఆరాధన – నిన్నే నే ఘనపరచెదన్
నీకే నా ఆరాధన – నీకే
యేసయ్యా…