prathi dhinamu noothana vaathsalyam choope yesayya ప్రతి దినము నూతన వాత్సల్యం చూపే యేసయ్య
ప్రతి దినము నూతన వాత్సల్యం చూపే యేసయ్య
నీప్రేమను నేను మరువను నా
యేసయ్య
నీ సన్నిధి నేను విడువను నా యేసయ్య
నేను స్తుతింతును
నేను ఘనపరతును
నిన్నే ఆరాధిస్తూ ఆనందించేదా
నీలోయేసయ్య
కలుషములెన్నో నాలో ఉన్న
నీ రక్తముచే నను కడిగితివి
తుఫానులాంటి కష్టములేన్నో
నాపై లేచినను
నా నావకు నావికుడవై నను
నడిపిన యేసయ్య
తప్పిపోయిన గొర్రెను నేను
నీప్రేమతో పిలచి రక్షించితివి
నీ సన్నిధిలోన నివసించే కృప నిచ్చిన దేవా
నీ మాటను జవదాటను
నా యేసయ్య
యేసుని రక్తమే నను రక్షించెను
యేసుని మాటలే నను బ్రతికించెను
యేసు నీవే తోడుగా ఉండగా
నాకు అపాయమే రాదు
నీవెంటే నేవుంటే నాకు కోదువేఉండదయ్య